conductor attacks officer | లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : conductor attacks officer | రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. అయితే లంచం ఓ అధికారిని తాజాగా బస్​ కండక్టర్​, ప్రయాణికులు చెప్పులతో కొట్టారు. ఈ ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​  డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టికెట్​ ఇన్​స్పెక్టర్ (Ticket Inspector)​ రాయికోడ్​ వద్ద ఆపారు. అందరి వద్ద టికెట్లు ఉన్నాయా లేదా అని చెక్​ చేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి టికెట్​ తీసుకోలేదని గుర్తించారు. ఆ ప్రయాణికుడితో పాటు కండక్టర్​పై కేసు పెట్టకుండా ఉండేందుకు సదరు అధికారి రూ.20 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్​, డ్రైవర్​, ప్రయాణికులు అతడిపై చెప్పులతో దాడి చేశారు.

conductor attacks officer | వీడియో వైరల్

టికెట్ ఇన్‌స్పెక్టర్ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. వాదన తీవ్రరూపం దాల్చడంతో అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. అవినీతి అధికారులను అలాగే కొట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాడి చేసిన వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. లంచం అడిగితే ఇలాగే బుద్ధి చెప్పాలని పేర్కొంటున్నారు. కాగా రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవినీతి అధికారులను వల పన్ని పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. దీంతో ప్రజల్లో మార్పు వచ్చి లంచం అడిగితే ఇలా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Sadashivpet ACB Trap | ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి లంచావతారం.. ఏసీబీకి చిక్కిన బిల్​ కలెక్టర్​!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *