అక్షరటుడే, వెబ్డెస్క్: Punganur Stone Attack | స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) వేళ ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది.
ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Punganur Stone Attack | నామినేషన్ కేంద్రంలోకి..
రాళ్ల దాడి అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ నేతలు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లారు. అయితే టీడీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రంలోకి సైతం దూసుకెళ్లేందుకు యత్నించారు. బారికేడ్లను తొసుకుంటూ నామినేషన్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు మిథున్ రెడ్డిని ప్రత్యేక రూమ్లోకి తీసుకెళ్లి భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఆయన గంట నుంచి నామినేషన్ కేంద్రంలోనే ఉన్నారు. ఆయన ఉన్న గదిలోకి రాకుండా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి..: Koneti Sulochana Arrest | కూలీ స్థాయి నుంచి కోట్ల ఆస్తుల వరకు.. లేడీ డాన్ సులోచన అరెస్ట్