అక్షరటుడే, వెబ్డెస్క్: Abhijit Dipke Tiranga Yatra | సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే ‘తిరంగా యాత్ర’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ పోలీసు బృందం ఒకటి అభిజీత్ దిప్కే ఉంటున్న నివాసానికి చేరుకుంది. కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో చేపట్టాలనుకున్న ‘తిరంగా యాత్ర’ను నిర్వహించవద్దని కోరుతూ నోటీసు అందజేసింది.
Abhijit Dipke Tiranga Yatra | అమల్లోకి నిషేధాజ్ఞలు
కన్నాట్ ప్లేస్లో ప్రస్తుతం సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు (Delhi Police) తెలిపారు. ‘తిరంగా యాత్ర’ కోసం న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ నుంచి గానీ, పోలీసుల నుంచి గానీ ఎటువంటి అనుమతి పొందలేదని నోటీసులో పేర్కొన్నారు.నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా కన్నాట్ ప్లేస్కు వెళ్లి యాత్రను నిర్వహిస్తే, అది సెక్షన్ 163 ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. దీనివల్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Abhijit Dipke Tiranga Yatra | పరిపాలనా కారణాల దృష్ట్యా..
నిరసనకారుల్లో కొంతమందిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు ప్రతిపాదించారు. పరిపాలనా కారణాల దృష్ట్యా శుక్రవారం, శనివారాల్లో సెంట్రల్ పార్క్ను ప్రజల కోసం మూసి ఉంచుతున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Connaught Place Tiranga March | సీజేపీ తిరంగా మార్చ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు