Telangana Activists Welfare Website | ఉద్యమకారుల కోసం వెబ్‌సైట్ ఏర్పాటు అభినందనీయం

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్ ఏర్పాటు చేయడం అభినందీనయమని ఉద్యమకారుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana Activists Welfare Website | ఉద్యమకారుల సంక్షేమం కోసం, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్ ఏర్పాటు చేయడం అభినందీనయమని ఉద్యమకారుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెయూ క్యాంపస్​ ఆవరణలో సంబరాలు నిర్వహించారు.

Telangana Activists Welfare Website | పలువురికి పాలాభిషేకం..

ఉద్యమకారుల జేఏసీ నాయకులు పుప్పాల రవి, పస్క నర్సయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), టీపీసీ చీఫ్​ మహేష్​కుమార్​ గౌడ్​, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్లపాటు ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Nandipet Durga Devi Festival | అద్భుతం.. రూ. 2.11 కోట్లతో అమ్మవారికి అలంకరణ..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *