అక్షరటుడే వెబ్‌డెస్క్: Vi Prepaid Family Plan | టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ అయిన వీఐ (Vi) సరికొత్త సేవలతో ముందుకు వచ్చింది. భారతదేశంలోనే ( India ) మొట్టమొదటిసారిగా ‘ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్’ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ‘వీఐ పే సబ్ హైన్ వీఐపీ’ (Vi Pe Sab Hain VIP) అనే సరికొత్త ఆలోచన ఆధారంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. దేశంలో ఎక్కడి నుంచైనా కుటుంబ సభ్యులు సులభంగా కనెక్ట్ అయి ఉండేందుకు, డేటాను పంచుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.
Vi Prepaid Family Plan | ప్లాన్ ప్రత్యేకతలు ..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ క్లాసులు, మ్యాప్స్ వాడకం, డిజిటల్ పేమెంట్స్ వంటి అత్యవసర సమయాల్లో డేటా అయిపోతే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తెచ్చారు. యాక్టివ్‌గా ఉన్న వీఐ ప్రీపెయిడ్ యూజర్లు తమ వీఐ యాప్ ద్వారా ఒక ప్రైమరీ మెంబర్, ముగ్గురు సెకండరీ మెంబర్లతో కలిపి ఒక ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్‌లోని ప్రతి సభ్యుడు తమ స్వంత ప్రీపెయిడ్ ప్లాన్, వాలిడిటీని యథాతథంగా కొనసాగిస్తూనే.. అవసరమైనప్పుడు ఒకసారికి 500 MB వరకు డేటాను ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా లేదా వేర్వేరు నగరాల్లో ఉన్నప్పటికీ ఈ గ్రూప్‌లో చేరి డేటా ప్రయోజనాలను పొందవచ్చు.
Vi Prepaid Family Plan | రీఛార్జ్‌లపై డిస్కౌంట్లు ..
వీఐ యాప్ ద్వారా కుటుంబ సభ్యులు ఎవర్ని రీఛార్జ్ చేసినా 10% వరకు గ్యారెంటీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ సరికొత్త సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌తో కలిసి వీఐ ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్‌క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం