ABPS National President | మానవత్వం, సోదరభావంతోనే ఐక్యత : ఏబీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్

కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటూ మానవత్వం, సోదరభావానికి ప్రాధాన్యమివ్వాలని ప్రబోధ్ సుమేర్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: ABPS National President | కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటూ మానవత్వం, సోదరభావానికి ప్రాధాన్యమివ్వాలని ఆల్ బ్రాహ్మణ ప్రోగ్రెస్సివ్ సొసైటీ (ఏబీపీఎస్) జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్ సూచించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ABPS National President | భీమ్​గల్​ పట్టణంలో..

దేవీ శరన్నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా భీమ్‌గల్ మండల (Bheemgal Mandal) ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, పరస్పర గౌరవం, ప్రేమ, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పండుగలు కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు.

ABPS National President | రైతుల సంక్షేమమే ముఖ్యం

భీమ్‌గల్ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రబోధ్ సుమేర్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి దుర్గమ్మ కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, చెరువులు, కుంటలు నిండి రైతుల కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించారు. పంటలు బాగా పండి ప్రతి రైతు కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Madiga Employees Union | మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ ఎన్నిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *