Nallavelli Farmers Resurvey | నల్లవెల్లి రైతులకు అండగా ఎమ్మెల్యే.. భూముల రీసర్వేకు ఆదేశం

ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ రైతులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి అండగా నిలిచారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Nallavelli Farmers Resurvey | ఇందల్వాయి(Indalwai) మండలం నల్లవెల్లి గ్రామ రైతులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy)అండగా నిలిచారు. గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న పలువురు రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

Nallavelli Farmers Resurvey | రైల్వే ప్రాజెక్టు కోసం భూములు..

రైల్వే ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతుల వివరాలను సంబంధిత అధికారులు పత్రికా ప్రకటనలో తప్పుగా ప్రచురించారని, వాస్తవానికి తమకు ఎక్కువ భూమి ఉన్నప్పటికీ తక్కువ విస్తీర్ణాన్ని నమోదు చేశారని రైతులు వివరించారు. ఈ తప్పిదం వల్ల తమకు రావాల్సిన నష్టపరిహారం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కోరారు. రైతుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి రీసర్వే నిర్వహించాలని, భూముల వాస్తవ విస్తీర్ణాన్ని నిర్ధారించి అర్హులైన   రైతులకు న్యాయంగా, తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: నమ్మితే నట్టేట ముంచేస్తారు..!సైబర్ నేరగాళ్ల నయా ఎత్తుగడలు 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *