Bathukamma Celebrations | ఖండాంతరాలు దాటిన బతుకమ్మ వైభవం.. సెయింట్ లూయిస్​లో ఘనంగా సంబరం

బతుకమ్మ సంబరం ఖండాంతరాలు దాటింది. తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రత్యేకమైన ఈ పండుగను తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bathukamma Celebrations | బతుకమ్మ సంబరం ఖండాంతరాలు దాటింది. తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రత్యేకమైన ఈ పండుగను తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మన ఆడపడుచులు సగర్వంగా తెలంగాణ (Telangana) సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటుతున్నారు.

Bathukamma Celebrations | సెయింట్​ లూయిస్​లో..

Bathukamma Celebrations

అమెరికాలోని సెయింట్ లూయిస్ సిటీలో బ్రోమిన్ సిక్ పార్క్​లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ సెయింట్​ లూయీస్​ ఆధ్వర్యంలో తెలంగాణ పూలపండగైన బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, నిజామాబాద్​ ఇతర జిల్లాకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నవారికి బహుమతులు అందజేశారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Transport Department | రవాణాశాఖ అవినీతిపై నెట్టింట వైరల్​.. డీటీసీ దుర్గా ప్రమీల కీలక ఆదేశం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *