Maheshwaram Car Accident | కోనేరులోకి దూసుకెళ్లిన కారు..

మహేశ్వరంలో ఓ కారు కోనేరులోకి దూసుకెళ్లింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maheshwaram Car Accident | రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మహేశ్వరంలోని శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ కోనేరులోకి ఇన్నోవా కారు దూసుకెళ్లింది. రాత్రిపూట జరిగిన ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది.

ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోనేరులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం కొద్దిసేపటికే ఓ కారు నీటిలోకి దూసుకెళ్లింది. అతివేగంంగా వచ్చిన కారు.. అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా, అతను సురక్షితంగా బయటపడగలిగాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Maheshwaram Car Accident | తప్పిన ప్రమాదం

బతుకమ్మ వేడుకలు జరిగిన కొద్ది గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకవేళ ముందు జరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగేది. బతుకమ్మల నిమజ్జన సమయంలో కారు దూసుకెళ్లి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించాలని స్థానికులు కోరారు. పోలీసులు కారును బయటకు తీశారు.

ఇది కూడా చదవండి..: Hyderabad SI Transfers | హైదరాబాద్​లో భారీగా ఎస్సైల బదిలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *