Kanpur Murder Case | యూపీలో దారుణం.. కారుతో ఢీకొట్టి హత్య

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పాత కక్షల నేపథ్యంలో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kanpur Murder Case | ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కొంతమంది పాతకక్షల నేపథ్యంలో హత్య చేశారు.

కాన్పూర్‌లోని అర్రా ప్రాంతానికి చెందిన బీరు సింగ్‌ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేసేవారు. అతడికి రాజ్‌వీర్, మేవాలాల్ అనే వ్యక్తులతో గతంలో గొడవలు ఉన్నాయి. దసరా వేడుకల అనంతరం ఇంటికి వస్తున్న బీర్​సింగ్​పై మేవాలాల్, రాజ్‌వీర్, మరో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. తప్పించుకునేందుకు యత్నించగా.. కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత అతడిని కారు పైకప్పుపై పడేసి, చేతులను కిటికీల మధ్య కట్టేసి, సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వాహనాన్ని నడిపారు. అనంతరం అతడిని రోడ్డుపై పడేసి, కారుతో తొక్కించారు.

 Kanpur Murder Case | ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..

రోడ్డుపై పడి ఉన్న బీర్​సింగ్​ను చూసి దేవేంద్ర సింగ్ చౌహాన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హాలెట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితులు దీనిని ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే బాధితుడి భార్య రీనా సింగ్, ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని, తన భర్తను అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. బీర్​సింగ్​ను కారుపై కట్టుకొని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Gujarat Drug Seizure | గుజరాత్​లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *