అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందడంతో మార్కెట్ నష్టాలతో ప్రారంభమై నష్టాలతోనే ముగిసింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లపైనే ట్రేడ్ అవుతుండడంతో ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్‌ను వెన్నాడాయి. వివిధ రంగాల్లో విస్తృతస్థాయి అమ్మకాల కారణంగా ప్రధాన సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీ పతనాన్ని చూశాయి.
Indian Stock Market | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) ప్రారంభంలోనే తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు ప్రారంభ నష్టాలను తగ్గించుకున్నాయి. గురువారం ఉదయం 366 పాయింట్ల గ్యాప్ డౌన్ లో ప్రారంభమైన సెన్సెక్స్.. అక్కడినుంచి మరో 338 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బయ్యింగ్‌కు దిగడంతో కోలుకుని 715 పాయింట్లు ఎగబాకింది. 124 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. మరో 133 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 231 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 460 పాయింట్ల నష్టంతో 73,249 వద్ద, నిఫ్టీ 123 పాయింట్ల నష్టంతో 22,687 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,462 కంపెనీలు లాభపడగా 2,873 స్టాక్స్ నష్టపోయాయి. 230 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 59 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 487 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో, 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 1.61 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.52 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.71 శాతం, సన్‌ఫార్మా 0.51 శాతం, ఎస్బీఐ 0.46 శాతం పెరిగాయి.
Top Losers : రిలయన్స్ 2.59 శాతం, ఎటర్నల్ 2.20 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.85 శాతం, పవర్‌గ్రిడ్ 1.71 శాతం, ట్రెంట్ 1.56 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: BLS Polymers IPO | ఐపీవోకు పాలిమర్ కంపెనీ..