TG Safe Raids | పండుగ వేళ స్వీట్లు కొంటున్నారా.. అయితే జాగ్రత్త!

హైదరాబాద్​ నగరంలోని పలు స్వీట్​ షాపులపై టీజీ సేఫ్​ అధికారులు దాడులు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG Safe Raids | దసరా, దీపావళి సందర్భంగా స్వీట్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రజలు పండుగ వేళ మిఠాయిలు కొని, నోటిని తీపి చేసుకుంటారు. అయితే హైదరాబాద్​ (Hyderabad) నగరంలో స్వీట్లు కొనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. లేకపోతే అంతే సంగతులు. తాజా టీజీ సేఫ్​ అధికారులు పలు స్వీట్ షాపులపై దాడులు చేశారు.

టీజీ సేఫ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం పలు దుకాణాలను తనిఖీ చేశారు. గడువు ముగిసిన స్వీట్లను విక్రయిస్తున్నట్లు, చెల్లుబాటు అయ్యే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సులు లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అంతేగాకుండా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో స్వీట్లు తయారు చేస్తున్నారు. 12 బృందాలు ఈ తనిఖీలలో పాల్గొన్నాయి. ప్రజలు వేడుకలు, నైవేద్యాల కోసం మిఠాయిలను కొనుగోలు చేయడంతో వాటికి డిమాండ్ సాధారణంగా పెరిగే ఈ పండుగ సీజన్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

sweet shop

TG Safe Raids | లైసెన్స్​లు రద్దు

తనిఖీలలో పరిశుభ్రత ఉల్లంఘనలు, ఇతర ఆహార భద్రతా లోపాలు కనుగొన్న నేపథ్యంలో కూకట్‌పల్లిలోని వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్, మసబ్ ట్యాంక్‌లోని మధుర్ స్వీట్స్, చందానగర్‌లోని బి. బిచారెడ్డి స్వీట్స్ ఆహార భద్రతా లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మూడు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో ఉన్న వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్‌లో సాలెగూళ్లు, జిడ్డుగా ఉండే ఎగ్జాస్ట్‌లు, సరైన నిల్వ పద్ధతులు లేకపోవడం, ఆహారాన్ని అందించేవారిలో వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం గమనించారు.

TG Safe Raids | 330 కిలోల నెయ్యి స్వాధీనం

మసబ్ ట్యాంక్‌లోని హుమాయున్ నగర్‌లో ఉన్న మధుర్ స్వీట్స్‌లో మిఠాయిలపై కర్టెన్లు, వార్తాపత్రికలు కప్పారు. ఆహార పదార్థాలలో బొద్దింకలు, కీటకాలు తిరుగుతున్నాయి. అధికారులు రూ.5.63 లక్షల విలువైన 705 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బి. బిచారెడ్డి స్వీట్స్​ షాపులో రూ.2.12 లక్షల విలువైన 330 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకుంది. ఈ దుకాణంలో తుప్పుపట్టిన పరికరాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సాలెగూళ్లు, ఎలుకల రెట్టలను కనుగొన్నారు.

దీనిని కూడా చదవండి : Poonch Explosives Seizure | కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *