నిజామాబాద్Cattle Shed Fire | ప్రమాదవశాత్తు పశువుల కొట్టానికి నిప్పు.. అగ్నికీలల్లో జీవాలు విలవిల

Cattle Shed Fire | ప్రమాదవశాత్తు పశువుల కొట్టానికి నిప్పు.. అగ్నికీలల్లో జీవాలు విలవిల

ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పు అంటుకోగా.. అగ్నికీలల్లో పశువులు విలవిలలాడాయి. ఈ ఘటనలో ఓ లేగదూడ మృతి చెందింది. గాంధారి మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

అక్షరటుడే, గాంధారి: Cattle Shed Fire | ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పు అంటుకోగా.. అగ్నికీలల్లో పశువులు విలవిలలాడాయి. ఈ ఘటనలో ఓ లేగదూడ మృతి చెందింది. కామారెడ్డి జిల్లా గాంధారి (Gandhari) మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Cattle Shed Fire | చద్మల్​ తండాలో..

మండలంలోని చద్మల్​తండాకు (Chadmal Thanda) చెందిన మాండు దేవిసింగ్ అనే రైతు తన నాలుగు ఆవులు, రెండు గేదెలు, రెండు ఎడ్లు ఒక దూడను, మరోరైతు ఇందల్ సింగ్​కు చెందిన రెండు ఆవులను కలిపి తమ పొలం వద్ద ఉన్న గుడిసెలో కట్టేశారు. వాటికి మేత వేసి, నీళ్లు పెట్టి ఇంటికి వచ్చారు.

అయితే, ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పంటుకుంది. దీంతో కొట్టంలోని పశువులకు కూడా అగ్నికీలలు అంటుకున్నాయి. ఈ క్రమంలో ఓ లేగదూడ ఘటన స్థలంలోనే అసువులు బాసింది. మరికొన్ని పశువులకు కాలిన గాయాలయ్యాయి. ఫైరింజన్​కు (Fire engine) సమాచారం ఇచ్చినప్పటికీ అది వచ్చేలోపే కొట్టం పూర్తిగా కాలిపోయింది. దాదాపు 11 మూగజీవాలకు నిప్పు అంటుకోగా.. లేగదూడ శుక్రవాం మృతి చెందింది. మిగతావి తీవ్రంగా గాయపడ్డాయి.

Cattle Shed Fire | సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై, పశు వైద్యసిబ్బంది

సంఘటన జరిగిన ప్రదేశానికి పశు వైద్య సిబ్బందితో పాటు ఎస్సై మహేందర్​ చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీశారు. మృతి చెందిన దూడకు పశువైద్యులు పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.లక్షల్లో నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని.. నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ తహశీల్దార్​ రేణుక చవాన్​కు వినతిపత్రం అందజేశారు.

32

ఇది కూడా చదవండి: Arunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Health Ticket Bus | శారీరక శ్రమతోనే ప్రయాణం.. 20 బస్కీలు తీస్తే బస్సు టికెట్ ఉచితం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Health Ticket Bus | సాధారణంగా బస్సు BUS...

Government Employee | పీఆర్సీ అమలు చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Government Employee | ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై...

Mother Murder Case | తల్లి ప్రేమను కాలరాసిన కామం.. రూ.45 లక్షల కోసం అమ్మను బలితీసుకున్న కసాయి కూతురు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother Murder Case | ఏ బంధమైనా కాలక్రమేణా...

Sitaram Suicide Case | భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజులకే.. ప్రియుడితో పెళ్లి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sitaram Suicide Case | హైదరాబాద్ (Hyderabad)​లో...