అక్షరటుడే, వెబ్డెస్క్ : Gelatin Sticks Blast | ఏపీలోని అల్లూరి జిల్లా (Alluri District)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం పినకోట వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలి ఒక ఉపాధ్యాయురాలితో సహా ఐదుగురు మృతి చెందారు.
పినకోట వద్ద రోడ్డు పనులు చేపడుతున్నాయి. దీంతో బండరాళ్లను పగులకొట్టడానికి జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం జిలెటిన్ స్కిక్స్ అమర్చిన యంత్రంలో డీజిల్ నింపుతుండగా.. ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అనంతరం పేలుడు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్, ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఆ సమయంలో విధులకు వెళ్తున్న ఉపాధ్యాయురాలు సునీత సైతం ప్రాణాలు కోల్పోయారు.
Gelatin Sticks Blast | కేసు నమోదు
ప్రమాదంలో ఆ మార్గంలో వెళ్తున్న రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల్లో టీచర్ సునీత, కార్మికుడు మణి, నారాయణరావు, పవన్, డ్రైవర్ ఉన్నట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Elephant Electrocuted | విద్యుత్ షాక్తో ఏనుగు మృతి