అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rapido Driver Bites Constable | మందు కొట్టి వాహనం నడపడమే కాకుండా, తనిఖీలు చేస్తున్న పోలీసులపైనే దాడికి తెగబడి రోడ్డుపై తీవ్ర హంగామా సృష్టించాడో రాపిడో డ్రైవర్. తాగిన మైకంలో ఏకంగా విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్‌ను కొరికి రచ్చ రచ్చ చేసిన ఘటన గ్రేటర్ హైదరాబాద్ Hyderabad నగరంలోని చంద్రాయణగుట్ట సమీపంలో తీవ్ర కలకలం రేపింది.
Rapido Driver Bites Constable | అసలేం జరిగిందంటే..
చంద్రాయణగుట్ట పరిధిలో పోలీసులు యథావిధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో బైక్‌పై వస్తున్న ‘అజీజ్’ అనే రాపిడో డ్రైవర్‌ను ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్రమైన మద్యం మత్తులో ఉన్న అజీజ్.. పోలీసుల తనిఖీలను నిరాకరించడమే కాకుండా వారితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Rapido Driver Bites Constable | కానిస్టేబుల్‌ను కొరికి.. రోడ్డుపై రచ్చ!
పోలీసులు అతడిని సముదాయించి అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా, అజీజ్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొరికేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై పడి కేకలు వేస్తూ, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర హంగామా సృష్టించాడు.
Rapido Driver Bites Constable | పోలీసుల యాక్షన్..
రహదారిపై తోటి వాహనదారులు, బాటసారులు చూస్తుండగానే రాపిడో డ్రైవర్ చేసిన ఈ రచ్చతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు అజీజ్‌ను అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.