Gandhari Bridge Suicide Attempt | కుటుంబ కలహాలతో.. వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Gandhari Bridge Suicide Attempt | కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గాంధారి (Gandhari) మండలంలో ఆదివార చోటు చేసుకుంది.

Gandhari Bridge Suicide Attempt |  తరచూ గొడవలు

వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్​కు వలస వెళ్లాడు. స్కూల్ బస్సు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ మధ్య తరచు భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో భార్య గాంధారి పోలీస్​స్టేషన్​కు అతడిని తీసుకొచ్చింది. పోలీసులు కుటుంబసభ్యులు ముందుగా మాట్లాడుకోవాలని చెప్పగా ఇంతలోనే అంజయ్య కామారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు. దీంతో స్పందించిన స్థానికులు వెంటనే అంబులెన్స్​కు ఫోన్ చేశారు. కానీ అందుబాటులో లేక ప్రైవేట్​ అంబులెన్స్​లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: ఎండిన వరి పంటకు..నిప్పు పెట్టిన రైతన్న.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *