Ramanthapur Blast | స్క్రాప్ దుకాణంలో పేలుడు.. ఒకరికి తీవ్రగాయాలు

హైదరాబాద్​ నగరంలోని రామంతపూర్​లో పేలుడు చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramanthapur Blast | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని రామంతపూర్​లో పేలుడు చోటు చేసుకుంది. ఒక్క స్క్రాప్​ దుకాణంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

రామంతపూర్ చర్చ్ కాలనీలో గల స్క్రాప్ దుకాణంలో లోహాన్ని కోస్తుండగా భారీ పేలుడు చోటు చేసుకుంది. అనంతరం దుకాణం అంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి.

Ramanthapur Blast | పరిస్థితి విషమం

ఈ ప్రమాదంలో స్క్రాప్ డీలర్ పరశురామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలో సుమారు 70 శాతం కాలిపోయినట్లు సమాచారం. అతడిని అంబులెన్స్‌లో గాంధీఆసుపత్రికి తరలించారు. పరశురామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

దీనిని కూడా చదవండి : HMWS&SB ACB Raid | ఏసీబీకి చిక్కిన జలమండలి ఉన్నతాధికారి.. రూ.2.40 లక్షలు స్వాధీనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *