Mann Ki Baat 139th Episode | ‘మన్ కీ బాత్’ సామాన్యుల విజయగాథలకు జాతీయ వేదిక

సామాన్యుల విజయగాథలకు జాతీయవేదికగా ‘మన్ కీ బాత్’ నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Mann Ki Baat 139th Episode | సామాన్యుల విజయగాథలకు జాతీయవేదికగా ‘మన్ కీ బాత్’ నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. ఆదివారం దేశ ప్రధాని నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్​ను ఆయన వీక్షించారు.

Mann Ki Baat 139th Episode | 12 ఏళ్లుగా..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ప్రజలకు కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం కార్యక్రమ ప్రత్యేకత అని తెలిపారు. 12ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న మన్ కీ బాత్ ప్రజలకు, ప్రధానమంత్రికి మధ్య ఒక ఆత్మీయ వారధిగా నిలిచిందన్నారు. ఈ ఎపిసోడ్​లో పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్-త్రింజన్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడం విశేషమని పేర్కొన్నారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు, చేనేత నైపుణ్యాలను భావితరాలకు అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని వివరించారు.

ఇది కూడా చదవండి: SBI సిబ్బంది నిర్లక్ష్యం తీరు..SMలో వీడియో వైరల్ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *