అక్షరటుడే, బాన్సువాడ: Banswada Gambling Raid | అడవిలో గుట్టుగా పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బాన్సువాడ (Banswada) మండలంలోని తాడ్కోల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.
Banswada Gambling Raid | పక్కా సమాచారం మేరకు..
సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్కోల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు దాడులు చేశారు. ఈ క్రమంలో ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50,280 నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేకాట చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా జూదం అడుతున్నట్లు సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్‌పై అభిమానం.. 70 ఏళ్ల వయస్సులో పొలిటికల్ ఎంట్రీ..!