AP WhatsApp Services | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్‌లో వైద్య సేవలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP WhatsApp Services | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సాప్​ ద్వారా అనేక సేవలు అందిస్తున్న సర్కార్.. తాజాగా ఆ జాబితాలో వైద్య సేవలను సైతం చేర్చింది.

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడం, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రభుత్వం ఈ గవర్నెన్స్​ విధానం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు రకాల సేవలను వాట్సాప్​ ద్వారా అందిస్తోంది. ఇటీవల పదో తరగతి, ఇంటర్​ ఫలితాలు సైతం వాట్సాప్​లో చూసుకునే అవకాశం కల్పించింది. తాజాగా ఏపీ మెడికల్ కౌన్సిల్ (AP Medical Council) సేవలు ప్రారంభించింది. ​’మనమిత్ర’ (Manamitra) వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా సేవలు అందనున్నాయి. ఆ నంబర్​కు వాట్సాప్​లో హాయ్ అని పంపితే సేవలు పొందే అవకాశం ఉంది.

AP WhatsApp Services | ఇలా చేయాలి

మనమిత్ర నంబర్​ను ప్రజలు తమ ఫోన్​లో సేవ్​ చేసుకోవాలి. అనంతరం ఆ నంబర్​కు వాట్సాప్​లో “Hi” లేదా “హాయ్” అని మెసేజ్ పంపాలి. అప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ​ఆరోగ్య శాఖ మెనూ ద్వారా AMC సేవలను ఎంచుకోవాలి. ఆస్పత్రల్లో ఓపీ సేవలు, రక్త లభ్యత వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. అంతేగాకుండా డాక్టర్ల రిజిస్ట్రేషన్ వివరాలు, వారి దరఖాస్తుల స్థితి వంటి సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Hotel Food Prices | భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం వరకు భోజన ధరలు పెంపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *