అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy Meeting | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో తొలిసారిగా ప్రభుత్వ విప్‌లతో సమావేశం కానున్నారు. వారికి బాధ్యతలు అప్పగించి విపక్ష విమర్శలకు సమర్థంగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) మార్చిలో పలువురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. శాసన సభ విప్‌లుగా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, విజయ రమణారావు, వేముల వీరేశంను, శాసన మండలి విప్‌లుగా బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌ను నియమించింది. వారితో సీఎం తొలిసారి సమావేశం కానున్నారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచాయి. బీఆర్ఎస్, బీజేపీతో పాటు కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయి.
CM Revanth Reddy Meeting | ధీటుగా ఎదుర్కోవాలి
ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అలాగే రైతు భరోసా (Rythu Bharosa), ఆర్టీసీ వీలినం తదితర సమస్యలపై ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ విప్‌లు సైతం కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరింత ధీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని సీఎం విప్‌లకు మార్గనిర్దేశం చేయనున్నారు.
ఇది కూడా చదవండి..: Government Employee | పీఆర్సీ అమలు చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ!

