Contract Teacher Death | కాంట్రాక్టు ఉపాధ్యాయుడి ఆత్మహత్య

కామారెడ్డి పట్టణంలో ఉపాధ్యాయుడి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Contract Teacher Death | కాంట్రాక్టు టీచర్ మృతి అనుమానాలు రేకెత్తిస్తోంది. కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఉపాధ్యాయుడి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Contract Teacher Death | హైకోర్టు తీర్పుతో..

కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వీసం రాజు (42) హైకోర్టు తీర్పుతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని చనిపోయాడని ప్రచారం సాగుతోంది. డీఎస్సీ 2008లో మెరిట్​లో సెలక్ట్ అయిన రాజు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో.28 వల్ల ఉద్యోగం కోల్పోయి హైకోర్టును ఆశ్రయించాడు. ఈనెల 13న ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సమర్థించడంతో మెరిట్ సాధించిన తమకు ఉద్యోగాలు రాకుండా తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని, హైకోర్టు తమకు అన్యాయం చేసిందని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మృతునికి భార్య అర్చన, ఇద్దరు పిల్లలు తేజస్వర్(7), నిఖిత(3) ఉన్నారు. అయితే పోలీసులకు భార్య అర్చన ఇచ్చిన ఫిర్యాదు మాత్రం ప్రచారానికి భిన్నంగా ఉంది. తన భర్త గత కొంతకాలంగా అజీర్ణం, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాడని, పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదని ఫిర్యాదులో మృతుని భార్య పేర్కొంది. ఈనెల 25న మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకున్నాడని, అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని, ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’ గొడవ! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *