Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 39 ఫిర్యాదులు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ నగరంలో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 39 ఫిర్యాదులు అందాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 39 ఫిర్యాదులు అందాయి. నగరంలోని సీపీ కార్యాలయంలో (Nizamabad Police) పోలీస్​కమిషనర్​ సాయిచైతన్య (CP Sai Chaitanya) స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు.

Nizamabad Police Prajavani | నిర్భయంగా ఫిర్యాదు చేయండి

ప్రజావాణిలో భాగంగా స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడిన సీపీ సాయిచైతన్య వారి సమస్యలు విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్​స్టేషన్ల ఎస్సైలు, సీఐలతో మాట్లాడి చట్టపరంగా సమస్యల పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఒకరి అరెస్ట్.. పరారీలో ఇద్దరు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *