Airtel YouTube Premium | ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్!

ఈ కాంబో ద్వారా యూజర్లకు ఉచితంగా 'యూట్యూబ్ ప్రీమియం' ప్రయోజనాలను అందించనుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Airtel YouTube Premium | ప్రీపెయిడ్ మొబైల్ Mobile వినియోగదారులకు సరికొత్త డిజిటల్ వినోదాన్ని అందించేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజం ‘ఎయిర్‌టెల్’ సిద్ధమైంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ (YouTube) తో ఎయిర్‌టెల్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కాంబో ద్వారా యూజర్లకు ఉచితంగా ‘యూట్యూబ్ ప్రీమియం’ ప్రయోజనాలను అందించనుంది.

Airtel YouTube Premium | ప్రీమియంతో కలిగే ప్రయోజనాలు

యాడ్-ఫ్రీ కంటెంట్: వీడియోలు, షార్ట్స్ చూస్తున్నప్పుడు మధ్యలో ఎలాంటి ప్రకటనలు (Ads) రావు.

బ్యాక్‌గ్రౌండ్ ప్లే: స్క్రీన్ లాక్ చేసినా లేదా ఇతర యాప్స్ వాడుతున్నా బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో/ఆడియో ప్లే అవుతుంది.

ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్: వైఫై లేని సమయంలో చూసేందుకు వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ మ్యూజిక్: లక్షలాది పాటలను ప్రకటనలు లేకుండా ఉచితంగా వినవచ్చు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Airtel YouTube Premium | రూ.200 ఓటీటీ ప్యాక్‌తో మరిన్ని ప్రయోజనాలు

ఈ ఆఫర్ అందుకోవడానికి కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.200 ఓటీటీ యాడ్-ఆన్ ప్యాక్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అదనపు డేటా: ఈ ప్యాక్‌తో 30 జీబీ అదనపు డేటా ఉచితంగా లభిస్తుంది.

18+ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: యూట్యూబ్ ప్రీమియంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 (ZEE5), సోనీలివ్ (SonyLIV) సహా సుమారు 18కి పైగా ప్రముఖ ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్లు ఈ ప్యాక్‌లోనే లభించనున్నాయి.

ఎక్కువ డేటాతో పాటు అంతరాయం లేని వినోదాన్ని కోరుకునే వారికి ఎయిర్‌టెల్ తెచ్చిన ఈ కొత్త ప్యాక్ ఎంతో లాభదాయకంగా మారనుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *