అక్షరటుడే, డిచ్పల్లి: Nizamabad BJP Protest | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన పదవి కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసే ముఠామేస్త్రీ లా వ్యవహారిస్తున్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నగర (Nizamabad) శివారులోని మాధరనగర్ బ్రిడ్జ్ వద్ద చేపట్టిన నిరసన దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Nizamabad BJP Protest | ఉత్తర తెలంగాణకు నిధులివ్వకుండా..
ఉత్తర తెలంగాణకు నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిధులను కొడంగల్ నియోజకవర్గానికి తీసుకుపోతున్నాడని విమర్శించారు. అబద్ధపు హామీలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పబ్బం గడుపుతున్నారని, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల అవినీతి చేస్తూ భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దేశంలో అల్లర్లు సృష్టించాలని కాంగ్రెస్ కుయుక్తులు చేస్తోందని ఆరోపించారు.
Nizamabad BJP Protest | ప్రయాణికులకు ఇబ్బందులు..
అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. మాధవనగర్ గేటు మీదుగా నిత్యం సుమారు నాలుగైదు వేల వాహనాలు, 58 రైళ్లు ప్రయాణం చేస్తాయన్నారు. ఒక్కసారి గేటు పడితే ఇరువైపుల పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్‌పై ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు. లక్షలాది ప్రజల ఇబ్బందులు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆర్వోబీ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న అసెంబ్లీ సమావేశల్లో అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ నిరసన దీక్షలో భాగంగా భిక్షాటన చేశారు. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ కులాచారి, రాష్ట్ర నాయకులు గద్దె భూమన్న, మేడపాటి ప్రకాష్, మల్లికార్జున్, స్రవంతి రెడ్డి, పోతంకర్ లక్ష్మినారాయణ, మారెడ్డి అనిత తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మా వాళ్ల మీద చేయి వేశారంటే.. అది నా మీద చేయి వేసినట్లే..