అక్షరటుడే, కామారెడ్డి: Municipal Corruption | మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకపోతే పనులు చేయడం లేదని పలువురు బాధితులు ఆరోపించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
Municipal Corruption | కమిషనర్, అధికారులకు వ్యతిరేకంగా..
కమిషనర్, కిందిస్థాయి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన కొడుకు బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే అప్రూవల్ చేయడానికి రూ.3వేలు అడిగారని, చివరికి రూ.2,500 ఇస్తే అప్రూవల్ చేశారని టేక్రియాల్ గ్రామానికి చెందిన సందీప్ తెలిపారు. డబ్బులు ఇవ్వకపోవడంతో సుమారు మూణ్నెళ్ల పాటు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయం జీ ప్లస్–1 పర్మిషన్ ఇచ్చిందని, ఆ తర్వాత మున్సిపల్ స్థలంలో ఇల్లు కడుతున్నానని పిల్లర్లు కూల్చేశారని గాంధారి (Gandhari)కి చెందిన చిరంజీవి అన్నారు. పిల్లర్లు కూల్చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే పనులు ఆపవద్దని కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పు ప్రకారం రెండు రోజుల నుంచి పనులు మొదలుపెడితే ప్రశాంత్ అనే వ్యక్తిని ఇంటి వద్దకు పంపించి పనులు నిలిపివేయించారని, మున్సిపల్ వద్దకు వచ్చి ప్రశాంత్ అనే వ్యక్తిని కలిస్తే కమిషనర్ కు ఎంతోకొంత డబ్బులు ఇచ్చి పనులు చేసుకోవాలని సలహా ఇచ్చాడన్నారు.
Municipal Corruption | డబ్బులిస్తే పనులు చేస్తామంటున్నారు..
డబ్బులిస్తే పనులు కొనసాగిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నించారు. టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజు తన తండ్రి చనిపోతే ఆయన పేరిట ఉన్న ఇల్లు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తన పేరు మీదకు మారిందన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో డెత్ సర్టిఫికెట్, ఇతరత్రా పత్రాలు అన్నీ సమర్పించినా పేరు మార్పిడి కావడం లేదన్నారు. ఆర్నెళ్లు ఫైల్ దగ్గర పెట్టుకుని తిప్పుతున్నారని, అడిగితే రూ.10 వేలు ఇస్తే పని అవుతుందంటున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Cybercrime and Drug Control | సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రణాళికతో ముందుకెళ్లాలి : సీపీ సాయిచైతన్య