Kharge Effigy Burned | కామారెడ్డిలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kharge Effigy Burned | ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను కామారెడ్డి పట్టణంలో బీజేపీ నాయకులు (BJP Protest) ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని (Kamareddy) నిజాంసాగర్ చౌరస్తాలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం చేశారు.

Kharge Effigy Burned | దిగజారుడు రాజకీయాలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, దేశ అత్యున్నత పదవిలో ఉన్న పీఎం పట్ల గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం మానుకోవాలని, పీఎం పట్ల చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అర్నబ్ తుఫాను తీవ్ర రూపం.. 140 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *