Gandhari Woman Death | గేదె విషయంలో గొడవ.. ఆపేందుకు వెళ్లిన మహిళ మృతి

ఇంటి పక్కన రెండు కుటుంబాలు గొడవ పడుతుంటే ఆపేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు అనుకోని స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Gandhari Woman Death | ఇంటి పక్కన రెండు కుటుంబాలు గొడవ పడుతుంటే ఆపేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు అనుకోని స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గాంధారి మండలం (Gandhari Mandal)లో చోటుచేసుకుంది.

Gandhari Woman Death | గేదెను కట్టేసే విషయంలో గొడవ..

వివరాల్లోకి వెళితే గాంధారి మండలంలోని నేరల్​తండా గ్రామానికి చెందిన మధురా భాయ్ ఇంటి పక్కన వరుసకు కోడళ్లయిన ఇద్దరు మహిళలు గొడవ పడుతున్నారు. గోదెను తమ స్థలంలో కట్టేసిందనే విషయంలో ఇరువురు మహిళలు కొట్లాడుతుండగా.. మధ్యలో మధురా బాయి వెళ్లి సముదాయించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వారు కర్రతో ఆమె తలపై దాడిచేసినట్లుగా సమాచారం. దీంతో గాయపడ్డ మధురబాయి(60)ను తండావాసులు వెంటనే గాంధారి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. దీంతో తండావాసులు గాంధారి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. మధురబాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. అక్కడికి చేరుకున్న సీఐ చౌదరి, ఎస్సై మహేందర్​ బాధిత కుటుంబాలకు నచ్చజెప్పినప్పటికి వారు వినిపించుకోలేదు. ప్రస్తుతం ధర్నా కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి..: Kharge Effigy Burned | కామారెడ్డిలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *