Congress Protest | రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్​ నాయకుల ధర్నా

సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress Protest | సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​, మంత్రులు, నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.

ఇండియా కూటమి ఆధ్వర్యంలో నవంబర్​ 1న ఢిల్లీలోని రామ్​లీలా మైదానంలో భారీ ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ కోసం తెలంగాణ నుంచి వెళ్లడానికి ప్రత్యేక రైళ్లు నడపాలని కాంగ్రెస్​ నాయకులు కోరారు. రైల్వే శాఖ రైళ్లు నడపడం లేదని ఆరోపిస్తూ.. బుధవారం ఉదయం భారీ ధర్నా నిర్వహించారు. నిరసనకు మోదీ అడ్డుకుంటున్నారని నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్​ శ్రేణులు మెరుపు ధర్నా చేపట్టడంతో సికింద్రాబాద్​లో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే నిలయంలోకి చొచ్చుకెళ్లి రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

Congress Protest | పొన్నం ప్రభాకర్​కు అస్వస్థత

ఈ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, గణేష్ పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వారిని నాయకులు బయటకు తీసుకొచ్చారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్​ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: IAS Transfers | పలువురు ఐఏఎస్​ అధికారుల బదిలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *