KTR | రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన : కేటీఆర్​

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్​ఎస్​ నాయకులను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం బుధవారం మూసీ ప్రక్షాళన కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. అయితే దీనికి వెళ్లేందుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్​రెడ్డి యత్నించారు. వారిని పోలీసులు హౌస్​ అరెస్ట్ చేశారు. దీనిపై కేటీఆర్​ ఎక్స్​వేదికగా స్పందించారు. ఇందిరమ్మ పాలన అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులే అని మరోసారి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గుర్తు చేశారన్నారు. ఆయనకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

KTR | కరువు తాండవం చేస్తుంటే..

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. లక్షన్నర కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేపడుతామని చెప్పడం సిగ్గు చేటన్నారు. కరువుతో పంటలు ఎండి రైతులు అల్లాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం మూసీలో మూటలవేట సాగిస్తోందని విమర్శించారు. ఎడిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కుటుంబాల ఇళ్లు కూల్చి, రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ కుట్రను అడ్డుకుంటామని చెప్పారు. మూసీ ప్రక్షాళన ఆపి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Congress Protest | రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్​ నాయకుల ధర్నా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *