అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Shriram Finance Scholarships | ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు శ్రీరామ్ ఫైనాన్స్ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని (Nizamabad) దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు.
Shriram Finance Scholarships | 800 మంది విద్యార్థులకు..
నిజామాబాద్ రీజియన్ పరిధిలో సుమారు 800మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేస్తున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రీజినల్ హెడ్ వినయ్ కుమార్ తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్లు జగదీష్, మన్మథ, షఫీ ఖాన్, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మంగనిలో పెట్టి తిప్పితే సెట్ అవుతాయ్..తహశీల్దార్ దురుసు వ్యాఖ్యలు