Attack with Helmet | హెల్మెట్​తో కొట్టిన అల్లుడు.. బైక్​పై నుంచి పడి మహిళ మృతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Attack with Helmet | బైక్​పై వెళ్తుండగా వెనుక కూర్చున్న అత్తను హెల్మెట్​తో కొట్టాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె కింద పడి చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మేడిపల్లి పోలీస్​ స్టేషన్ (Medipally Police Station) పరిధిలో చోటు చేసుకుంది.

చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ (39)కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చిన్న కుమార్తె కావ్య గతేడాది కరీంనగర్‌ (Karimnagar)కు చెందిన స్నేహిత్(28) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొంతకాలంగా స్నేహిత్​కు, తన అత్త అరుణతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29 కావ్య తల్లి అరుణ(39)ను స్నేహిత్ బైక్​పై తీసుకెళ్లాడు.

Attack with Helmet | వాగ్వాదం జరగడంతో..

బైక్​పై వెళ్తుండగా అరుణ, స్నేహిత్​ మధ్య గొడవ జరిగింది. కోపానికి గురైన అతడు తన హెల్మెట్​తో అత్తను కొట్టాడు. దీంతో అరుణ కింద పడి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది.

Attack with Helmet | పట్టించిన సీసీ ఫుటేజీ

బైక్​పై నుంచి అరుణ కింద పడగానే స్నేహిత్​ నాటకం ఆడాడు. ఆమెకు ఫిట్స్​ రావడంతో బండిపై నుంచి పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. బైక్ వేగంగా వెళ్తుండగా స్నేహిత్ తన హెల్మెట్‌తో ఆమెను బలంగా కొట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Medical Seat Scams | మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్​ హెచ్చరిక

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *