అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 30 Market Analysis | టెక్ స్టాక్స్ ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో గత సెషన్లో వాల్ స్ట్రీట్ నష్టాలతో ముగిసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ విభాగాలలోని స్టాక్‌లు ఒత్తిడికి గురవుతుండడంతో శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Oct 30 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 1.42 శాతం, ఎస్ అండ్ పీ 0.30 శాతం నష్టపోగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.29 శాతం నష్టంతో ఉంది.
Oct 30 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.29 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.04 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.26 శాతం లాభపడ్డాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Oct 30 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.13 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 5.28 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.78 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.74 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.74 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. సింగపూర్ మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.26 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ. 943 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 1,924 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలహీనపడి 95.25 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 113.03 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.74 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.92 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.07 నుంచి 1.31 కు పెరిగింది.
- విక్స్ 6.94 శాతం తగ్గి 15.11 వద్ద ఉంది.