అక్షరటుడే, వెబ్‌డెస్క్: JNTU Lizard Incident | హైదరాబాద్ (Hyderabad)లోని ప్రముఖ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో గల ఓ హాస్టల్లో వండిన కూరలో బల్లి రావడం కలకలం రేపింది. క్యాంపస్‌లోని మంజీర బాలుర హాస్టల్లో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసేందుకు వెళ్లారు. మెస్‌లో వండిన కూరలో బల్లి కనిపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తోటి విద్యార్థులకు సమాచారం ఇవ్వడంతో వారు మెస్‌కు చేరుకున్నారు. కర్రీలో బల్లి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
JNTU Lizard Incident | మెస్ నిర్వాహకులపై విద్యార్థులు ఫైర్..
రాత్రి డిన్నర్ చేసేందుకు హాస్టల్ మెస్‌కు వెళ్లిన విద్యార్థులకు కూరలో బల్లి కనిపించింది. అప్పటికే కొందరు విద్యార్థులు ఆ భోజనం తినేశారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. మెస్‌లో భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్వాహకుల అలసత్వంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూమ్ రెంట్లు, మెస్ ఛార్జీలు క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న అధికారులు.. నాణ్యతను మాత్రం గాలికొదిలేశారని మండిపడ్డారు.
JNTU Lizard Incident | మెస్ ప్రాంగణంలో ఆందోళన
మెస్ నిర్వహణ తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: PAANI App | నీటి దుర్వినియోగానికి చెక్.. ‘పానీ’ యాప్ ప్రారంభించిన మంత్రి పొన్నం