Indian Stock Market | లాభాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఒడిదుడుకులకు లోనవుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడినా ఆ తర్వాత కోలుకుంది. ఉదయం సెన్సెక్స్ 48 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైనా.. వెంటనే లాభాల స్వీకరణతో 117 పాయింట్లు తగ్గింది.

అక్కడినుంచి కోలుకుని 426 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో ప్రారంభమై 59 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి కోలుకుని 137 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 74,480 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 23,033 వద్ద ఉన్నాయి.

Indian Stock Market | ఐటీ, ఫార్మా రంగాల మద్దతుతో..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) ఐటీ, ఫార్మా రంగాల మద్దతుతో లాభాల బాటలో సాగుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.18 శాతం, ఫార్మా సూచీ 1.45 శాతం లాభంతో ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ 1.90 శాతం, టెలికాం 1.59 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.04 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 14 స్టాక్స్ లాభాలతో, 16 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ట్రెంట్ 5.77 శాతం, ఇన్ఫోసిస్ 2.91 శాతం, ఇండిగో 2.76 శాతం, ఎన్టీపీసీ 2.35 శాతం, పవర్‌గ్రిడ్ 2.19 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎస్బీఐ 1.39 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.33 శాతం, బీఈఎల్ 0.94 శాతం, టాటా స్టీల్ 0.77 శాతం, అదానీపోర్ట్స్ 0.67 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Oct 30 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *