అక్షరటుడే, నేషనల్ డెస్క్: Helicopter Crash | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోషిమఠ్ సమీపంలో ఆరుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ సమయంలో పైలట్‌తో సహా అందులో ఆరుగురు ఉన్నారు.
Helicopter Crash | పైలట్లతో సహా ఆరుగురు..
ట్రాన్స్ భారత్‌కు చెందిన వీటీ–హెచ్సీఎక్స్ రిజిస్ట్రేషన్ నంబర్ గల హెలికాప్టర్ శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్ పట్టణంలో కూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో సహా ఆరుగురు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్ ఫాటా నుంచి బద్రీనాథ్ ఆలయానికి వెళుతున్నట్లు సమాచారం. ప్రయాణికులు, పైలట్ పరిస్థితి ఇంకా తెలియరాలేదు.
Helicopter Crash | గాలింపు చర్యలు
గల్లంతైన హెలికాప్టర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దాని శకలాలను గుర్తించేందుకు మరో రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. అయితే, ఆ ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, దట్టమైన మేఘాలు గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో హెలికాప్టర్ కచ్చితమైన స్థానాన్ని గుర్తించడం బృందాలకు కష్టంగా మారింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై గానీ, శిథిలాల వెలికితీతపై గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
Helicopter Crash | ఆందోళన వ్యక్తం చేసిన సీఎం
జోషిమఠ్ సమీపంలోని చాయీ గ్రామం వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ భాగస్వామ్యంతో సంయుక్త సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తక్షణమే హెలికాప్టర్‌లో తరలించాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. ప్రయాణికులందరూ క్షేమంగా తిరిగి రావాలని ధామి ప్రార్థించారు.
ఇది కూడా చదవండి..: Aryan Shukla World Records | ఏఐ కంటే ఫాస్ట్.. మైండ్‌తోనే వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఇండియన్ జీనియస్!