అక్షరటుడే, ఎల్లారెడ్డి: Vote Bachao Desh Bachao | ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి కామారెడ్డి (Kamareddy) జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.
Vote Bachao Desh Bachao | ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో..
ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కామారెడ్డి జిల్లా నుంచి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రామ్‌లీలా మైదానానికి బయలుదేరారు. ఓటు హక్కుల పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, రాజ్యాంగ విలువల కాపాడటమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఐక్యంగా తరలివెళ్లి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: మీటర్ రీడింగ్ టాంపరింగ్..షో రూమ్ ట్రాక్ చేయిస్తే…