అక్షరటుడే, నెట్వర్క్: Congress Party Controversy | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యేపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
Congress Party Controversy | దుర్భాషలాడాడని ఆరోపణలు..!
జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) పలువురు ఎమ్మెల్యేల సమక్షంలోనే అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడే ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. ఒక సీనియర్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేతో వ్యవహరించిన తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Congress Party Controversy | ఎమ్మెల్యే ఆత్మగౌరవానికి భంగం కలిగేలా..
ఎమ్మెల్యేపై ఆ స్థాయిలో విరుచుకుపడ్డారనే అంశం ప్రస్తుతం జుక్కల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తక్షణమే స్పందిస్తూ, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ముందస్తు అధికారికంగా ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..: Firecracker Sales Rules | క్రాకర్స్ విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీ సాయిచైతన్య