అక్షరటుడే, వెబ్‌డెస్క్: FDI in Insurance | బీమా రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే ఇప్పటి వరకు ఇది 74 శాతంగా ఉండేది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీలో ఇప్పుడు ఉన్న 20 శాతం ఎఫ్‌డీఐ మాత్రం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇన్సూరెన్స్ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. దీంతో ప్రీమియం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
FDI in Insurance | నిబంధనలకు లోబడే..
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు 1938 నాటి బీమా చట్టం (4 ఆఫ్ 1938) నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) స్వీకరించే కంపెనీలు బీమా, సంబంధిత కార్యకలాపాలను చేపట్టడానికి రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అవసరమైన లైసెన్స్ లేదా అనుమతి పొందాల్సి ఉంటుంది.
FDI in Insurance | గత డిసెంబర్లో బిల్లుకు ఆమోదం..
బీమా రంగం వృద్ధితో పాటు ప్రీమియంలను తగ్గించడం, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి వంద శాతానికి పెంచే బిల్లును గతేడాది డిసెంబర్‌లోనే పార్లమెంట్ ఆమోదించింది. కేంద్రం తాజా నిర్ణయంతో మరిన్ని కంపెనీలు దేశంలోకి రావడంతో పాటు పోటీ పెరిగే అవకాశంతో పాటు ప్రీమియంలు తగ్గే ఛాన్స్ ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

