అక్షరటుడే, వెబ్డెస్క్: Nacharam Hostel Fire | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాచారంలో గల ఓ లేడీస్ హాస్టల్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సావర్కర్ నగర్లో ఉన్న శ్రీ లక్ష్మి మహిళా హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఆస్తి నష్టం ఎంత వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Water Business | అక్రమ నీటి దందాపై చర్యలు.. ఏడు బోర్లు పూడ్చివేత