అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Parle Biscuit Factory Clash | బీహార్‌లో నుంచి వలస వచ్చిన కూలీలు కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టుకున్నారు. ఈ ఘటన నగర శివారులోని ఖానాపూర్ పార్లె బిస్కెట్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది.
Parle Biscuit Factory Clash | కుటుంబ కలహాల నేపథ్యంలో..
నిజామాబాద్ (Nizamabad) రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌లో పార్లె బిస్కెట్ ఫ్యాక్టరీలో బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు పని చేస్తున్నారు. అయితే బీహార్‌లో వారి నివాసం వద్ద జరుగుతున్న గొడవల నేపథ్యంలో కార్మికులు ఫ్యాక్టరీలో గొడవపడ్డారు. ఈ క్రమంలో బాధితుడు ధీరేంద్రనాథ్పై అనిల్ నాద్ దాడి చేశాడు. ఈ ఘటనో ధీరేంద్రనాథ్ కుడిచెవి కట్ అయ్యింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకుని బాధితుడికి జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Yellareddy Road Works | పెండింగ్ రోడ్డు పనులపై ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక దృష్టి