Rapthadu Attack Case | రాప్తాడు నిందితుడి కుడి కాలు తొలగింపు

రాప్తాడు కేసులో నిందితుడి కుడికాలును వైద్యులు తొలగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rapthadu Attack Case | అనంతపురం జిల్లా (Anantapur District) రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై చైన్‌సాతో దాడి చేసిన ఘటనలో నిందితుడు హేమంత్‌ కుడి కాలును అధికారులు తొలగించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్​ చేసి కాలు తీసేశారు.

రాప్తాడు జెడ్పీహెచ్​లో పదో తరగతి చదువుతున్న బాలికపై నిందితుడు ఎలక్ట్రిక్​ రంపంతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. రెండు కాళ్లలో ఆరు బుల్లెట్లు దిగడంతో.. ఆపరేషన్​ చేసి ఒక కాలు తొలగించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Rapthadu Attack Case | కోలుకుంటున్న బాలిక

రాప్తాడు ఘటనలో గాయపడిన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. ఆమె కళ్లు తెరిచినట్లు పేర్కొన్నారు. నవంబర్ 3న విడుదల చేసిన తాజా వైద్య నివేదిక ప్రకారం ఉదయం 9:30 గంటల సమయానికి, బాలిక కళ్లు తెరిచింది. ఆమె కీలక ఆరోగ్య సూచికలన్నీ స్థిరంగా ఉన్నాయి. ఈ వారంలో మరిన్ని సమగ్ర నేత్ర పరీక్షలు, ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంది. బాలిక ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉంది.

ఇది కూడా చదవండి.. Murasu Cyclone | తీరం దాటిన మురాసు తుపాన్​.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *