అక్షరటుడే, వెబ్డెస్క్ : SI Caught by ACB | రాష్ట్రంలో రోజురోజుకు అవినీతి పెరిగి పోతోంది. ఏసీబీ (ACB) కేసులు నమోదు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బజరహత్నూర్ సబ్ ఇన్స్పెక్టర్ జి రమేశ్ ఓ వ్యక్తి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అతడిని ఇరికించకుండా ఉండటానికి, పోలీసులు స్వాధీనం చేసుకున్న అతడి ఫోన్ను తిరిగి ఇవ్వడానికి రూ.50 వేలు అడిగాడు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించాడు.
SI Caught by ACB | మహిళ ఫోన్ చేయడంతో..
సదరు మహిళ ఆత్మహత్యకు ముందు ఆ వ్యక్తికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఎస్సై రమేశ్ కేసులో ఇరికిస్తానని బెదిరించి, లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అయితే ఎస్సై నేరుగా లంచం తీసుకోలేదు. గ్రామ శివార్లలో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో సెట్రింగ్ బాక్సుల కింద రూ.40 వేలు ఉంచమని ఫిర్యాదుదారుడిని ఆదేశించాడు. అతడు అలాగే చేశాడు. అనంతరం ఆ మొత్తాన్ని ఎస్సై వచ్చి తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : Indian Stock Market | ఐదో రోజూ లాభాల్లోనే..