Delhi Building Collapse | ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం

ఢిల్లీలోని చావ్రీ బజార్‌లో గురువారం ఉదయం మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Delhi Building Collapse | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్​ ఢిల్లీలోని చావ్రీ బజార్‌లో గురువారం ఉదయం మూడు అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారాలో ఉదయం 9:50 గంటలకు భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అధికారులు ఆ ప్రాంతాన్ని మూసి వేసి సహాయక చర్యలు చేపట్టారు. నీటి ట్యాంకర్లు, రెస్క్యూ వాహనాలు, ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Delhi Building Collapse | రద్దీ అధికంగా ఉన్న ప్రాంతంలో..

దీపావళి సందడి నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని చాందినీ చౌక్, చావ్రి బజార్ వంటి హోల్‌సేల్ మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ భారీగా ఉంటుంది. అయితే భవనం కింద ఎంత మంది చిక్కుకున్నారనే వివరాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల తరచూ ఢిల్లీలో భవనాలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి..: US Midterm Elections | ట్రంప్​లాగే.. మోదీ ఓడిపోతారు : విపక్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *