అక్షరటుడే, వెబ్డెస్క్: POCSO Case Medical Reports | లైంగిక దాడి, పోక్సో (POCSO) కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య అధికారులు, పోలీస్ దర్యాప్తు అధికారుల (IOs) మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు.
లైంగిక దాడులు, పోక్సో కేసులలో మెడికల్ అభిప్రాయాలు, వైద్య-చట్టపరమైన నివేదికలు (MLRs) పెండింగ్లో ఉండటంపై చర్చించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం (నవంబర్ 5) సాయంత్రం 5:00 గంటలకు బషీర్బాగ్లోని సీసీఎస్ (CCS) 5వ అంతస్తులోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్ అధ్యక్షత వహించగా, గాంధీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ హెచ్వోడీ నాగ మోహన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు సంబంధిత వైద్య నిపుణులు, దర్యాప్తు అధికారులు హాజరయ్యారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
POCSO Case Medical Reports | సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు..
- తక్షణ వైద్య పరీక్షలు: బాధితులకు ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించడం.
- ఫోరెన్సిక్ సాక్ష్యాల భద్రత: బాధితుల నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, సురక్షితంగా భద్రపరచడం.
- నివేదికల శీఘ్ర సమర్పణ: మెడికో-లీగల్ రిపోర్ట్స్ (MLRs)ను త్వరగా సిద్ధం చేసి పోలీస్ శాఖకు అందించడం.
- FSL నివేదికల సమన్వయం: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదికలు ఆలస్యం కావడం వల్ల నిలిచిపోయిన మెడికల్ అభిప్రాయాలను త్వరగా తెప్పించి కేసులలో పురోగతి సాధించడం.
- అధికారుల మధ్య సమన్వయం: కేసుల విచారణ నిర్దేశిత కాలపరిమితిలో ముగిసేలా వైద్య అధికారులు, దర్యాప్తు అధికారుల మధ్య సమిష్టి సమన్వయాన్ని పెంపొందించడం.
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని, పెండింగ్లో ఉన్న నివేదికలను త్వరగా పూర్తి చేసి సహకరించాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.