అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్న వేళ.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకెళ్తున్నాయి. బుల్ జోరుతో దలాల్ స్ట్రీట్ ముందుగానే దీపావళి పండుగ చేసుకుంటోంది. యాంటీ ఏఐ సెంటిమెంట్ భారత మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలో ఏడు సెషన్ల వ్యవధిలోనే సెన్సెక్స్ 6,287 పాయింట్లు, నిఫ్టీ 2,194 పాయింట్లు పెరిగాయి. ఇది గతేడాది నవంబర్ తర్వాత అత్యంత సుదీర్ఘమైన ర్యాలీ కావడం గమనార్హం.
Indian Stock Market | గ్లోబల్ మార్కెట్లలో సెల్లాఫ్..
ఏఐ సంబంధిత స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో ప్రపంచ మార్కెట్లు భారీ సెల్లాఫ్‌కు గురయ్యాయి. అయితే ఇందుకు విరుద్ధంగా భారతీయ ఈక్విటీలు పుంజుకున్నాయి. యాంటీ ఏఐ ట్రేడింగ్‌తో భారత ప్రధాన సూచీలు వరుసగా ఏడో సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుండడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు వంద డాలర్ల దిగువకు దిగిరావడం వంటి కారణాలతో మన మార్కెట్లు రాణించాయి. అయితే ప్రధాన సూచీలు రాణించినా.. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
Indian Stock Market | ఫ్లాట్ గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 103 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలతో అక్కడినుంచి 397 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమై 150 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 2,012 పాయింట్లు, నిఫ్టీ 642 పాయింట్లు ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 1,718 పాయింట్ల లాభంతో 81,028 వద్ద, నిఫ్టీ 494 పాయింట్ల లాభంతో 25,030 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,873 కంపెనీలు లాభపడగా 2,529 స్టాక్స్ నష్టపోయాయి. 224 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 110 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 102 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Indian Stock Market | ఒక్కటి మినహా..
బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 29 కంపెనీలు లాభాలతో, ఒక కంపెనీ నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 0.57 శాతం నష్టపోయింది. ఎంఅండ్ ఎం 6.15 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.65 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.56 శాతం, టైటాన్ 3.36 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.19 శాతం లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Rally | భారీ లాభాల్లో ప్రధాన సూచీలు