Woman Murder Case | మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మహిళ హత్య కేసులో నిందితుడికి నిజామాబాద్​ కోర్టు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Woman Murder Case | మహిళ హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ధర్పల్లి పోలీస్ స్టేషన్ (Dharpally Police) పరిధిలో జరిగిన ఘటన వివరాలను ఎస్సై సందీప్ తెలియజేశారు.

Woman Murder Case | ధర్పల్లి గ్రామంలో..

ధర్పల్లి గ్రామానికి చెందిన కోటగిరి గంగాధర్ 2025లో ఓ మహిళను హత్యచేసిన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసి, న్యాయస్థానంలో తగిన ఆధారాలు, సాక్ష్యలను సమర్పించగా, విచారణ అనంతరం జిల్లాకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ నిందితుడు కోటగిరి గంగాధర్​కు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఇన్‌స్పెక్టర్ భిక్షపతి , సహకరించిన పోలీస్ సిబ్బందిని గౌరవ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.

ఇది కూడా చదవండి: బీజేపీ నాయకులకు.. ప్రజల సమస్యలు పట్టవా..? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *