అక్షరటుడే, కామారెడ్డి: Crime Prevention Technology | నేర నియంత్రణ, కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP rajesh Chandra) అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
Crime Prevention Technology | కేసుల పురోగతిపై ఆరా
జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణపై సమీక్షించారు. సీసీటీఎన్‌ఎస్ అప్లికేషన్‌ను స్వయంగా పరిశీలించిన ఎస్పీ, ప్రతి కేసు వివరాలు, కీలక ఆధారాలను నిర్ణీత సమయంలో నమోదు చేయాలని, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. ప్రతి కేసులో నాణ్యమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. శాస్త్రీయ ఆధారాలతో పటిష్టమైన చార్జిషీట్లు దాఖలు చేయాలని, దీర్ఘకాలిక పెండింగ్, మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
Crime Prevention Technology | జైలు నుంచి విడుదలైన వ్యక్తులను..
జైలు నుంచి విడుదలైన వ్యక్తుల పర్యవేక్షణ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై ముందస్తు నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. జూదం, పేకాట నిర్మూలనకు 4 ప్రత్యేక బృందాలతో 24/7 నిఘా ఉంచాలని, జూదం ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. షీ టీమ్స్ అప్రమత్తంగా పనిచేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ గట్టుమల్లు, ఏఆర్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ వచ్చాక..ప్రజల భూములను అమ్ముతున్నారు