AP Local Elections | ఏపీ స్థానిక ఎన్నికలు.. కౌంటింగ్​ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్​లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Local Elections | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్​ ముగిసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం కౌంటింగ్​ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, తర్వాత బ్యాలెట్ బాక్సులను తెరిచారు.

స్థానిక ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య సాగిన విషయం తెలిసిందే. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రిగ్గింగ్​ ఆరోపణలు సైతం వచ్చాయి. టీడీపీ, వైసీపీ నాయకులు పలు చోట్ల ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.

AP Local Elections | ఏజెంట్లను అనుమతించని వైనం

మార్కాపురం మార్కెట్‌ యార్డు కౌంటింగ్‌ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. ZPTC, MPTC అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్‌హాల్‌లోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్ చేయగా.. ఇద్దరు వైసీపీ ఏజెంట్లకు గాయాలు అయ్యాయి.

ఇది కూడా చదవండి..: TTD Specified Authority | టీటీడీలో కీలక పరిణామం : ముగ్గురు ఐఏఎస్‌లతో ‘స్పెసిఫైడ్ అథారిటీ’ నియామకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *