అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indiramma Illu Diwali | దీపావళి పండుగను పురస్కరించుకుని ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.
Indiramma Illu Diwali | ఇందిరమ్మ ఇళ్లు పూర్తయిన వాటిలో..
ఇందిరమ్మ పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇళ్లలో దీపావళి పండుగ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దివ్వెలు వెలిగించి, ప్రత్యేక సంబురాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Collector Ila Tripathi) సూచించారు. లబ్ధిదారులు తమ సొంత ఇంటిలో తొలి దీపావళి వేడుకను ఆనందోత్సాహంతో జరుపుకునేలా ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించేలా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇన్ఛార్జి హౌసింగ్ పీడీ గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: PM SHRI Funds Utilization | పీఎంశ్రీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి